నవంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం GST వసూళ్లలో 10% తగ్గుదల నమోదైంది. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ నెలలో GST వసూళ్లు 2023లో ₹4,093 కోట్లు ఉండగా, తాజా లెక్కల ప్రకారం 2024లో ఇది ₹3,699 కోట్లకు తగ్గింది. ఇలా రాష్ట్రానికి వచ్చే పన్నులు ప్రతి నెలా తగ్గుతూ రావడం, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
ఆర్ధిక నిపుణుల అంచనాల మేరకు, గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా జనాలకు ధనాన్ని చేర్చడంతో ప్రజా కొనుగోలు శక్తి పెరిగి, ఎక్కువ GST వృద్ధి నమోదవుతూ వచ్చింది. కానీ నేడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పెన్షన్ల పెంపు మినహా ఇంకా ఇతర సంక్షేమ పథకాలను ప్రారంభించని నేపథ్యంలో, GST వసూళ్లు తగ్గడానికి ఒక కారణం అవొచ్చని తెలుస్తుంది. అంతేకాకుండా, వరి పంట కొనుగోలు ధరలో తగ్గుదల కూడా ప్రజల ఆదాయం పై మరింత ప్రభావం చూపించింది.
Also read:
https://voiceofandhra.org/telugu/2024/12/28/man-mimics-chandrababu-naidu-viral-video/