గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకుల వివాదాస్పద రేవ్ పార్టీలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నూతన సంవత్సరం వేడుకల పేరుతో, డిసెంబర్ 31న గొల్లపుంత రోడ్డులో ఉన్న ఓ లేఔట్లో ఈ పార్టీ నిర్వహించబడినట్లు సమాచారం.
అసభ్య నృత్య ప్రదర్శనలు
ఈ పార్టీలో అసభ్య నృత్య ప్రదర్శనలు జరిగినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్న వారిని సౌకర్యాలు కల్పించిన నిర్వాహకులు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో పార్టీ నైతిక ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియోలపై జనసేన మౌనం
వీడియోల వల్ల జనసేనకు చెందిన నాయకుల ప్రవర్తనపై విమర్శలు రావడంతో పార్టీ అధికారులు స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికార ప్రతినిధులు ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
పార్టీ ప్రతిష్టకు డ్యామేజ్?
జనసేన పార్టీ ప్రధానంగా యువతకు ఆకర్షణీయంగా ఉండేలా ఆవిర్భవించింది. అయితే ఇలాంటి ఘటనలు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తాయి అంటున్నారు విశ్లేషకులు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై త్వరలోనే స్పందించి చర్యలు తీస్కోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.