పల్నాడు జిల్లాలో మద్యం రవాణా డ్రామా
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ సినిమా స్టైల్‌లో మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మినీ లారీ కొనుగోలు చేసిన బాలకృష్ణ, అందులో రహస్యంగా మద్యం రవాణా చేయడానికి ప్రత్యేక అరలను రూపొందించుకున్నాడు.
పుదుచ్చేరి నుండి రహస్యంగా మద్యం రవాణా
పుదుచ్చేరి నుంచి పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసి, తుంగపాడుకు రవాణా చేస్తున్న సమయంలో ఈ డrama గుట్టు రట్టయింది. ఎక్సైజ్ అధికారులు కట్టుదిట్టమైన తనిఖీల్లో భాగంగా లారీని ఆపి తనిఖీ చేయగా, లారీ లోపల రహస్య అరలలో దాచిన మద్యం బాటిళ్లు బయటపడ్డాయి.
ముగ్గురి అరెస్టు
ఈ అక్రమ రవాణా ఘటనలో బాలకృష్ణతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/01/03/jana-sena-leaders-rave-party-controversy/