దబిడి దిబిడే అంటూ.. మహిళలను మరోసారి అవమానించిన సినీ హీరో బాలకృష్ణ

సినీ హీరో నందమూరి బాలకృష్ణ మరియు ఉర్వశి రౌటేలా నటించిన దబిడి దిబిడి పాట తీవ్ర విమర్శల పాలవుతోంది. ఈ పాటను పార్టీ సాంగ్‌గా ప్రచారం చేసినప్పటికీ, ఇందులోని నృత్య దృశ్యాలు ‘అశ్లీలంగా’ మహిళలను అవమానించేలా ఉన్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు.. ఆడది కనిపిస్తే ముద్ధైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అన్న వ్యాఖ్యలు నెట్టింట చర్చకు వస్తున్నాయి. ఎమ్మేల్యే గా ఉన్న సినీ హీరో బాలకృష్ణ (64 ఏళ్లు) మరియు ఉర్వశి రౌటేలా (30 ఏళ్లు) మధ్య వయసు తేడా కూడా విమర్శలకు ప్రధాన కారణంగా నిలిచింది.

మహిళలకు మద్దతుగా.. సోషల్ మీడియాలో బాలకృష్ణపై ట్రోల్స్

మహిళల అశ్లీలతను హైలెట్ చేస్తోందంటూ దబిడి దిబిడి పాటపై సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రతికూలత వ్యక్తమవుతోంది. చాలా మంది ఈ పాటను ‘అసభ్యంగా’ ఉందని, ‘చూడటానికి ఇబ్బందికరంగా’ ఉందని పేర్కొంటున్నారు. బాలకృష్ణకు కంటే చాలా తక్కువ వయసున్న ఉర్వశి రౌటేలా జంటగా నటించడం చర్చనీయాంశమైంది. ఈ అంశం ప్రేక్షకుల అభిరుచికి విరుద్ధంగా ఉందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మహిళలపై బాలకృష్ణ పాత వివాద వ్యాఖ్యలు వైరల్

ప్రస్తుత వివాదం బాలకృష్ణకు సంబంధించిన తొలి వివాదం కాదు. గతంలో ఓ ఆడియో ఫంక్షన్‌లో ఆయన చేసిన మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు కామెంట్ల రూపంలో చర్చకు వస్తున్నాయి.

 

Also read:

https://voiceofandhra.org/telugu/2025/01/03/cinema-style-liquor-smuggling-palanadu/

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *