తాడేపల్లి:
పింఛన్ లబ్ధిదారులపై టీడీపీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వ ఏర్పాటైన ఆరు నెలల్లోనే రీవెరిఫికేషన్ పేరుతో 3.5 లక్షల పింఛన్లు తొలగించారని ఆరోపించారు.
వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టడం దారుణమని, ఈ చర్యలు ఆగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
సుధాకర్‌బాబు ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు:
లబ్ధిదారులపై కక్షతో టీడీపీ చర్యలు:
- పింఛన్ లభ్ధిదారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం, రీవెరిఫికేషన్ పేరుతో వారిని వేధించడంలో నిమగ్నమైందని సుధాకర్‌బాబు విమర్శించారు.
- వైద్య బృందాలను పంపించి లబ్ధిదారుల అర్హతను మళ్లీ పరిశీలించడం వారిపై కక్షతో చేసిన చర్యగా ఆయన అభివర్ణించారు.
39 లక్షల నుంచి 66 లక్షల వరకు పింఛన్లు:
- 2019లో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 39 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 66 లక్షలకు పెరిగింది.
- చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లో 3.5 లక్షల పింఛన్లు తొలగించిందని, ఇది సంక్షేమ పథకాలపై దాడికి తావులేదని తెలిపారు.
జగన్ తీసుకున్న సంస్కరణలు:
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య పెరిగిందని సుధాకర్‌బాబు గుర్తుచేశారు.
- అర్హత వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించడం, ఆదాయ పరిమితిని పెంచడం, భూమి పరిమితిని సడలించడం వంటి సంస్కరణల వల్ల ఎక్కువ మందికి పింఛన్లు అందాయన్నారు.
రీవెరిఫికేషన్ కోసం వైద్య బృందాలు:
- పింఛన్లు తొలగించడానికే టీడీపీ వైద్య బృందాలను రంగంలోకి దింపిందని, ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడుకున్న చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు.
- రీవెరిఫికేషన్‌లో ఎవరికైనా అన్యాయం జరిగితే, హైకోర్టు, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడమే గాక, బాధితులకు న్యాయం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.