తిరుపతి విశ్వనివాసం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర దురదృష్టకరంగా అభివర్ణించారు. ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితి ఎవరి తప్పిదం వల్ల జరిగిందని చెప్పడం కష్టం అని వ్యాఖ్యానించారు.
“మేము ముందుగా పోలీసులను ఏర్పాటు చేయమని సూచించాం, వాళ్లు అన్ని ఏర్పాట్లు చూసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఈ విషాదం జరిగిపోయింది, మనం చింతించడం తప్ప మరేమీ చేయలేం,” అని ఆయన అన్నారు.
ఘటనపై పూర్తి విచారణ జరిపి, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భక్తుల రక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ హామీ ఇచ్చారు.
Also read: