- “క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?”
- “ఎవరో చెబితే మేము ఎందుకు క్షమాపణలు చెబుతాం?”
తిరుపతి తొక్కిసలాట ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినట్లుగా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
“పవన్ కళ్యాణ్ చెప్పరు అని మేము క్షమాపణలు చెబుతామా? అసలు, క్షమాపణలు చెప్పడం వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?” అంటూ నాయుడు ప్రశ్నించారు.
పవన్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసిన చైర్మన్, టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. “మేము ప్రజల సేవలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. ఇలాంటి సందర్భాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తగదని” ఆయన అన్నారు.
తిరుపతి ఘటన నేపథ్యంలో జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగా, టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.