విశాఖపట్నం:
కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణ గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్సీ, వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. భీమిలి నియోజకవర్గంలో మైనర్ బాలికలపై వరుస దాడులు జరిగాయని, హోం మంత్రిత్వ శాఖ సొంత జిల్లాలోనే ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు.
మద్యం, మాదక ద్రవ్యాల వల్లే దాడులు
మద్యం విక్రయాలు, 50,000కి పైగా బెల్ట్ షాప్లు, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల విస్తరణ వల్ల మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దాడుల్లో 80% మద్యం మత్తులో జరుగుతున్నాయని, belt షాపులు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
బాధితులకు సాయం లేదు
ఎటికొప్పాకలో చిన్నారిపై లైంగిక దాడి, రాంబిల్లి గ్రామంలో యువతిని చంపిన ఘటనలపై హోం మంత్రి స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
తక్షణ చర్యలపై డిమాండ్
- బెల్ట్ షాపుల తొలగింపు
- మద్యం విక్రయాల నియంత్రణ
- మాదక ద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు
“ఇకనైనా ప్రభుత్వం మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలి, లేకపోతే మహిళలే ఉద్యమిస్తారు” అని ఆమె హెచ్చరించారు.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/01/22/yogi-vemana-jayanthi-neglect/