వైయస్ భారతి రెడ్డి బంధువైన, సాక్షి మీడియా టాప్ ఎగ్జిక్యూటివ్ రాణి రెడ్డిని ఆఫీసు నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.
సాక్షి మీడియా వ్యవహారాల్లో ఆమె చాలా కాలంగా సత్తా చూపిస్తుండగా, ఆమె చెప్పింది మాత్రమే వైయస్ భారతి వింటారని సాక్షి మీడియా ఉద్యోగులు చెప్తుంటారు.
తాజాగా సాక్షి పత్రికలో టీడీపీ కోటి సభ్యత్వాల ప్రకటన వచ్చిన నేపథ్యంలో రాణి రెడ్డిని తొలగించినట్టు ప్రచారం జరుగుతోంది.
సాక్షి మీడియా వర్గాల ప్రకారం, రాణి రెడ్డికి రెండు నెలల నోటీసు ఇచ్చి, ఇక ఆమె ఆఫీసుకు రాకూడదని, సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనక్కర్లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇది సాక్షి మీడియాలో భారీగా మార్పులకు, అంతర్గత పునఃసంఘటనకు సంకేతంగా భావించబడుతోంది.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/01/25/ysrcp-opposes-medical-college-privatization/