రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్

తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

  • కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ
  • ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలి
  • రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు
  • ప్రలోభపెట్టడం, భయపెట్టడం, దాడులకు తెగబడటం కొనసాగుతోంది
  • ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదు
  • అన్నిచోట్లా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు
  • పవిత్రమైన తిరుపతి ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా టీడీపీ నేతలు దాడులు

ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలి

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైయస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలని లేళ్ళ అప్పిరెడ్డి కోరారు. వైయస్ఆర్ సీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి, అఖరికి దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామిక వ్యవస్థను పరిరక్షించేందుకు ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తిరుపతిలో టీడీపీ అరాచకాలు

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ కార్పొరేటర్ల వాహనంపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. బలహీన వర్గాల మహిళ అయిన మేయర్ శిరీష వాహనంపై దాడి చేయడం దుర్మార్గమని లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. ఈ ఘటన రాష్ట్ర ప్రజాస్వామ్యంపై మచ్చగా మిగిలిపోతుందని తెలిపారు.

టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు

రాష్ట్రంలో వైయస్ఆర్ సీపీ కార్పొరేటర్లకు రక్షణ లేకుండా పోయిందని లేళ్ళ అప్పిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాలని, లేకపోతే ఈ ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం

తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో కనీస మెజారిటీ లేకపోయినా టీడీపీ అధికార దుర్వినియోగంతో గెలవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. గతంలో తాడిపత్రిలో వైయస్ఆర్ సీపీ గెలవకపోయినా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లు గుర్తుచేశారు. టీడీపీ కూడా అదే విధంగా వ్యవహరించాలని లేళ్ళ అప్పిరెడ్డి సూచించారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *