లోక్ సభలో మిథున్ రెడ్డి ప్రధాన అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక అంశాలపై మాట్లాడారు. ఆయన ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని తగ్గించడాన్ని, ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు విషయంలో ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.

 

పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించడం అన్యాయం

మిథున్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు తగ్గించడం రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే నీటిని, రాయలసీమకి అందించే నీరును దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

ఇంగ్లీష్ మీడియం పాఠశాలలపై విమర్శలు

విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని కొనసాగించాలని పేర్కొంటూ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలపై కూడా విమర్శలు చేశారు. ఇంగ్లీష్‌లో చదవడం వల్ల మాత్రమే విదేశీ కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు దొరుకుతాయని తెలిపారు. తెలుగు మీడియం పాఠశాలలు కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మార్గదర్శి కుంభకోణం

మిథున్ రెడ్డి, మార్గదర్శి స్కామ్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్బిఐ నిబంధనలను ఉల్లంఘించి 2600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అన్నారు. డిపాజిటర్ల డబ్బులను తిరిగి చెల్లించకుండా వాటిని రెన్యూవల్ చేయడాన్ని తప్పుపట్టారు. ఈ అంశంపై ప్రధానిని జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకత

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా ఆయన తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ గ్రూపును పిలిచి మాట్లాడాలని సూచించారు.

డ్రగ్స్ నివారణకు కేంద్రం జోక్యం

విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం కేంద్రం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *