రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమిలో పార్టీల మధ్య విభేదాలు మరోసారి బగ్గు మన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా బిజెపి మరియు టిడిపి పార్టీల మధ్య సమన్వయ లోపం మరియు విభేదాలు బహిర్గతమయ్యాయి.
ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ సందర్భంగా టిడిపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిరంజీవిరావు టిడిపి మరియు కూటమి మద్దతు రఘువర్మకే నని చెప్పారు. మరోవైపు PRTU మరియు STU లా మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి హాజరైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ తమ వద్దు మద్దతు శ్రీనివాసులుకే నని స్పష్టం చేశారు. ఇలా కూటమి నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంటే, గత కొంతకాలంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కూటమిలోని మూడు పార్టీల కిందిస్థాయి క్యాడర్ మధ్య అక్రమ వసూళ్ల పంపకాల విషయమై రగడ కొనసాగుతుంది. నాయకుల మధ్యనే సమన్వయం లేకపోయేసరికి కింది స్థాయిలో క్యాడర్ నిరువరించే పరిస్థితి లేకుండా పోయింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూడు పార్టీల కింది స్థాయి నేతలకు వేరువేరుగా మామూలు ఇచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఒక పార్టీ వారికి మామూలు ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వకపోతే కూటమిలోని ఇతర పార్టీల వారు వారిని వేధిస్తున్నారు.
వెంటనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో చొరవ తీసుకొని నాయకుల మధ్య సమన్వయం కుదుర్చుకోకపోతే కింది స్థాయిలో క్యాడర్ని నిరువరించే వారు లేక ప్రజలు ఇబ్బందుల గురై కూటమి ప్రభుత్వానికి తీరని మచ్చలా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.