శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర నియోజవర్గంలో ఓ మహిళకు పోలీస్ స్టేషన్‌లో అవమానం జరిగిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళా ఫిర్యాదుదారుతో సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, తనను ఛాంబర్‌లో ఒంటరిగా పిలిచి అవమానించాడని గాయత్రి అనే బాధితురాలు ఆరోపించారు.
ఏం జరిగింది?
పరిచయస్తులతో జరిగిన వివాదంపై ఫిర్యాదు చేయడానికి గాయత్రి మడకశిర పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడి సీఐ రామయ్య ఆమెను రాత్రి సమయంలో ఛాంబర్‌లోకి పిలిచి అసభ్యకరంగా మాట్లాడారని ఆమె ఆరోపిస్తున్నారు. “ఒంటరిగా ఎలా ఉంటున్నావు? నేను సపోర్ట్ చేస్తా…” అంటూ అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలు తెలిపారు.
సీఐపై ఫిర్యాదు, స్థానికుల ఆగ్రహం
తనకు న్యాయం చేయాలని కోరుతూ గాయత్రి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమెను అవమానించిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్న మహిళా సంఘాలు
రాష్ట్రంలో మహిళా హోం మంత్రి, మహిళా ఎస్పీ, అదే జిల్లాకు చెందిన మహిళా మంత్రి ఉన్నా… పోలీస్ వ్యవస్థలో మహిళల భద్రత ఇలా ఉండటం దురదృష్టకరం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని పోలీస్ వ్యవస్థలో నైతిక విలువలు నిలిపేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/02/08/home-minister-fails-anakapalli-crimes/