– కూటమి ప్రభుత్వానికి సామాన్యుడి ప్రశ్నలు
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే పెన్షన్ రద్దుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. పుట్టుకతోనే గ్రుడ్డిగా, మూగగా జన్మించిన ఓ వ్యక్తి, యాక్సిడెంట్‌కు గురై పూర్తిగా ఆధారపడే స్థితికి చేరాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు దిక్కైన పెన్షన్‌ను రద్దు చేయడం ఎంతవరకు న్యాయం?
ఈ నిర్ణయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ప్రశ్నిస్తున్నారు:
🔹 దివ్యాంగుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం వారికి అందుతున్న కొద్దిపాటి సహాయాన్ని తీసేయడం ఏంటీ?
🔹 ఇదేనా ప్రజల్ని ఆదుకుంటామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు?
🔹 అత్యవసరంగా ఈ పెన్షన్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలదా? లేకపోతే ప్రజల బాధలను పట్టించుకోకపోవడమేనా?
ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెన్షన్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Also read: