రాష్ట్రంలో అధికార యంత్రాంగం మరియు మంత్రులపై చంద్రబాబు నియంత్రణ కోల్పోయారా?.. ఈ ప్రశ్నకు నిజమే అని సమాధానం వినిపిస్తోంది. ఇదేదో ఊహాజనితం కాదు రెండు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశమే దీనికి నిధర్శనం. బడ్జెట్ సమావేశాలకు ముందు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి సచివాలయంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మరియు కార్యదర్శి స్థాయి అధికారులు అందరూ సీఎం చంద్రబాబు సమావేశానికి వచ్చిన తర్వాత పది నిమిషాలకి తాపీగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వారి తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ దీనిని మంత్రులు గాని సీనియర్ ఐఏఎస్ లో కానీ ఎవరు సీరియస్ గా తీసుకో అన్నట్టు తెలుస్తుంది. దీనికి ముఖ్య కారణం చంద్రబాబు దగ్గర ఎలా ఉన్నా చినబాబు (లోకేష్) తో సఖ్యంగా ఉంటే సరిపోతుందని వారంతా భావిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యమైన అధికార కార్యక్రమాలకు రకరకాల కారణాలు చెబుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవుతున్నారు. ఇప్పటికే మొన్న బడ్జెట్ సమావేశాలు ముందు జరిగే కీలకమైన మంత్రివర్గ సమావేశానికి ఆరోగ్య కారణాల వల్ల హాజరుకాని పవన్ కళ్యాణ్, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై జరిగే కీలక సమయంలో తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఆలయాల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనితో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు జరిగే కీలక సమావేశాలకు కూడా ఆయన హాజరవడం ప్రశ్నార్థకమే. అయితే గత కొద్ది కాలంగా జనసేన ను మరియు బిజెపి బలోపేతం చేయడమే ముఖ్య ఎజెండా పెట్టుకొని పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా అధికారిక నిర్ణయాలు మరియు పాలనా పరమైన విషయాలు మంత్రి నాదెండ్ల మనోహర్ పై వదిలిపెట్టి నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నాదెండ్ల మనోహర్ నారా లోకేష్ కి పూర్తిగా దగ్గరగా ఉన్నారని మనోహర్ పార్టీలైన్ దాటి మరి తన సామాజిక వర్గానికి చెందిన చినబాబు డైరెక్షన్లో పని చేస్తున్నారని సీనియర్ అధికారుల మధ్య చర్చ జరుగుతోంది.
దీనివల్ల పరిపాలన వ్యవస్థ మొత్తం చిన్నబాబు గుపిట్లోకి వెళ్ళిపోయింది. దీనితో మంత్రులు, అధికారుల చినబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే చినబాబుతో బాగుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పనిలేదని అధికార యంత్రాంగం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.