చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఏకాంబర కుప్పం మండలం సత్రవాడ గ్రామంలో టీడీపీ నాయకుల ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పరిసరాల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందంటూ స్థానికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
గ్రామస్థుల ఆందోళన
ఇసుక మాఫియాతో స్థానిక రైతులు, గ్రామ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆరోపించారు. పరిసర ప్రాంతాల్లో నీటి మట్టం తగ్గిపోతుందని, దీంతో భవిష్యత్‌లో తాము నీటి కొరత సమస్యను ఎదుర్కొవాల్సి వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
“ఇసుక అక్రమంగా తరలిపోతున్నా, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అంటూ గ్రామస్థులు ప్రశ్నించారు. తాము పదేపదే ఫిర్యాదులు చేసినా, అధికారులు టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ గ్రామస్థులు
ఇసుక దోపిడీకి అధికారుల మౌనం కూడా కారణమని, త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్థులు హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే దీనిపై స్పందించి, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/02/13/vallabhaneni-vamsi-wife-arrest-te/