ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారితో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఇటీవల అర్చకుడు అనారోగ్యం బారినపడిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు.
ఆరోగ్య వివరాలు తెలుసుకున్న జగన్
ఫోన్ సంభాషణలో వైఎస్ జగన్, రంగరాజన్ గారి ఆరోగ్య పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. అర్చక కుటుంబ సభ్యులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
హిందూ ధర్మ పరిరక్షణపై రంగరాజన్ కృషి
చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ హిందూ ధర్మ పరిరక్షణకు చేస్తున్న కృషి ప్రసంశనీయమని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఆలయ పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం విషయంలో ఆయన పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
Also read:
https://voiceofandhra.org/telugu/2025/02/20/kondashikhara-burig-water-crisis/