తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే అప్పుల విషయంలో కొత్త రికార్డులు సృష్టించిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, 9 నెలల్లో బడ్జెటరీ అప్పులే రూ. 80,820 కోట్లు చేశారని వెల్లడించారు. అంతేకాదు, అమరావతి పేరు చెప్పి మరో రూ. 52,000 కోట్లు, అలాగే APMDC ద్వారా రూ. 5,000 కోట్లను రుణంగా తీసుకున్నారని చెప్పారు. ఈ మొత్తం కలిపితే కేవలం 9 నెలల్లోనే రూ. 1.4 లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారని ఆయన విమర్శించారు.
ఇంత అప్పు తీసుకొని ప్రజలకు ఏమిచ్చారు?
జగన్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ, ఈ భారీ అప్పులతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగించారని coalition ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యేకంగా సూపర్-6 పథకాలను ప్రకటించి, ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. అంతేకాదు, గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం ఆపివేసిందని ఆరోపించారు:
✅ అమ్మఒడి
✅ రైతు భరోసా
✅ వసతి దీవెన
✅ విద్యాదీవెన
✅ చేయూత
✅ ఆసరా
✅ వాహన మిత్ర
✅ నేతన్న నేస్తం
✅ చేదోడు
✅ లా నేస్తం
“9 నెలల్లో రూ. 1.4 లక్ష కోట్ల అప్పు చేశారు. కానీ, ప్రజలకు ఏమీ ఇచ్చారా?” అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాల్సిన ప్రభుత్వ విధానాలు, ఆర్థిక యాజమాన్యం పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు.
ఇంత పెద్ద మొత్తం అప్పు తీసుకున్న ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్తుందా? లేక ఈ అప్పుల భారంతో ఆంధ్రప్రదేశ్ మరింత లోతులోకి వెళ్లిపోతుందా?