నెల్లూరు: నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలంలోని గండిపాళెం గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులను తెల్లవారుజామున 3 గంటలకే చపాతీలు తయారు చేయించారని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు చదువు నేర్పించాల్సిన స్థలంలో వారితో వంటపని చేయించడం అనైతికమని వారు విమర్శించారు. ప్రతి ఆదివారం విద్యార్థులతో ఇలానే చేయిస్తామని ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం, దీంతో మరింత కలకలం రేగింది.
ఈ ఘటనపై స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల హక్కులను హననం చేస్తున్న సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, సంబంధిత అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.
Also read: