కూట‌మి పాల‌న‌కు ఉత్తరాంధ్ర టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫ‌లితం చెంపపెట్టు – గుడివాడ అమ‌ర్నాథ్

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాయని, అది ప్రజా వ్యతిరేక పాలనకు చెంపపెట్టులాంటిదని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ వైయస్సార్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూట‌మి ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిరసనగా ఉపాధ్యాయ లోకం గట్టిగా బుద్ధి చెప్పిందని వ్యాఖ్యానించారు.

గుడివాడ అమ‌ర్నాథ్ కీలక వ్యాఖ్యలు:

✔️ ఓట‌మిని అంగీక‌రించ‌లేని స్థితిలో కూట‌మి నేత‌లు
✔️ రఘువర్మకు టీడీపీ, జనసేన కలిసికట్టుగా మద్దతు
✔️ శ్రీనివాసులు నాయుడు గెలిచిన తర్వాత మాట మార్చిన కూటమి నేతలు
✔️ శ్రీనివాసులు నాయుడికి మద్దతిచ్చామని ఒక్క ఆధారమైనా చూపించగలారా?

“గెలిచిన అభ్యర్థే మా అభ్యర్థి అని చెప్పుకోవడం సిగ్గుచేటు” – అమ‌ర్నాథ్

రఘువర్మ ఘోరంగా ఓడిపోయాక టీడీపీ నేతలు తమ మాట మార్చి, గెలిచిన అభ్యర్థే తమ అభ్యర్థి అన్నట్లు ప్రవర్తించడం హాస్యాస్పదమని అమర్నాథ్ ధ్వజమెత్తారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా రఘువర్మకు మద్దతుగా సమావేశాలు నిర్వహించారని గుర్తు చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో టీడీపీ శ్రేణులు రఘువర్మకు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారని చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, అశోక్ గజపతిరాజు లాంటి నేతలు బహిరంగంగా రఘువర్మకు మద్దతు ప్రకటించారని వివరించారు.

జనసేన కూడా తన అధికారిక ఖాతాలో రఘువర్మనే తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిందని, మరి ఇప్పుడు శ్రీనివాసులు నాయుడుని తమ అభ్యర్థిగా చెప్పుకోవడం కూటమి నాయకుల ద్వంద్వ నీతి మాత్రమే అని మండిపడ్డారు.

“ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం – టీచర్ల తీర్పు గట్టిగా తగిలింది”

కేవలం 9 నెలల్లోనే కూట‌మి ప్ర‌భుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, దీని ఫలితమే ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు చూపిన తీర్పు అని అమ‌ర్నాథ్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ వైఫల్యాలు:
PRC కమిటీ ఏర్పాటు చేయలేదు
IR (ఇంటీమ్ రిలీఫ్) ఇవ్వలేదు
మూడు DA బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి
ఉద్యోగుల పెన్షన్ విధానంపై స్పష్టత లేదు
₹26,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది
జీతాలు కూడా ఆలస్యమవుతున్నాయి

“ఉత్తరాంధ్రపై వివక్ష – అభివృద్ధి జాడలు కూడా కనిపించట్లేదు”

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా క్రమరహితంగా మార్చిందని అమ‌ర్నాథ్ ఆరోపించారు. అమరావతికి రూ. 6,000 కోట్లు కేటాయించి, విశాఖను ఆర్థిక రాజధానిగా పిలుస్తూ రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు.

వైయస్సార్సీపీ హాయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి:

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
మూలపేట పోర్ట్
నర్సీపట్నం, పాడేరు, విజయనగరం లో మెడికల్ కాలేజీలు
ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్

అయితే, కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరాక ఉత్తరాంధ్ర అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని అన్నారు. రాజకీయ కక్షతో పాలించాలనే ఆలోచన అయితే ఇలాంటి ఫలితాలే వస్తాయని, ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయడంపై కూట‌మి ప్రభుత్వం దృష్టిపెట్టాలని గుడివాడ అమ‌ర్నాథ్ హెచ్చరించారు.


Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *