ఎన్నికల ముందు TDP నేతలు గొప్ప హామీ ఇచ్చారు – “మహిళలకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఉచిత బస్ ప్రయాణం!” కానీ ఏం జరిగింది? ఎన్నికలు ముగిసి ఏడాదైనా, ఆ హామీ అమలుకు నోచుకోలేదు.
తెలంగాణ, పంజాబ్, ఢిల్లీలో మహిళలు పూర్తిగా ఉచిత బస్ ప్రయాణం సౌకర్యాన్ని పొందుతున్నారు. కానీ మన ఏపీలో? స్కీం మొదలు కూడా కాకముందే దాన్ని కత్తిరించడం మొదలుపెట్టేశారు! రాష్ట్రం మొత్తం ఉచిత ప్రయాణం అనీ చెప్పారు, ఇప్పుడు అదంతా జిల్లా లిమిట్స్‌లోనే ఉండాలని అడ్డంకులు పెడుతున్నారు.
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, విద్యార్థులు, రోజువారీ పనుల కోసం బస్సుల మీద ఆధారపడేవాళ్లకు అసలు హామీ ఏమైందో అర్థం కాకుండా పోతోంది. ఇక అసలు అమలు అయిన తర్వాత ఇంకెన్ని పరిమితులు పెడతారో? ఇప్పటివరకు ఇచ్చిన హామీలను బట్టి చూస్తే, మహిళలు ఎంతవరకు నిజంగా ప్రయోజనం పొందగలరో చూడాలి.
ఇప్పటికైనా ప్రభుత్వం తన హామీకి న్యాయం చేస్తుందా? లేక ఇంకా కొత్త అడ్డంకులు పెడుతుందా? చూద్దాం, ఎదురుచూడాలి!